ETV Bharat / state

విజయవాడలో పైప్​లైన్​ పనులకు మంత్రుల శంకుస్థాపన

author img

By

Published : Feb 19, 2020, 11:35 PM IST

విజయవాడ తూర్పునియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలకు నీరందించేందుకు 6 కోట్లతో పైప్​లైన్​ పనులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. విజయవాడను ముంపు బారి నుంచి పూర్తిగా రక్షించేందుకు చేపట్టిన కరకట్ట రెండో దశ పనులకు రూ.125 కోట్లు నిధులను ప్రభుత్వం కేటాయించిందని.. సీఎం జగన్ త్వరలో దీనికి శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు.

pipe line workes stated by minister peddireddy ramchandrareddy  and vellampalli in Vijayawada
పైప్​లైన్​ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రులు

విజయవాడ నగరాన్ని ఆదర్శ నగరంగా తయారు చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో పైప్​లైన్​ పనులకు సంబంధించి శంకుస్థాపన చేసిన ఆయన.. విజయవాడను ముంపు బారి నుంచి పూర్తిగా రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాను పూర్తి మెజార్టీతో గెలిపించాలని కోరారు. నగరాన్ని స్మార్ట్​సిటీగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వెల్లంపల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు నియోజకవర్గ ఇం​చార్జీ దేవినేని అవినాష్​ పాల్గొన్నారు.

ఇదీ చూడండి:

విలువలు.. విశ్వసనీయతే మా బలం: బృహతి చెరుకూరి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.