ETV Bharat / state

మోటూరులో విద్యుత్ ​షార్ట్ సర్క్యూట్​తో అగ్ని ప్రమాదం - కృష్ణా జిల్లాలో అగ్ని ప్రమాదం

గుడివాడ మండలం మోటూరు తీట్ల వారి వీధిలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. రేకుల షెడ్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవటంతో మంటలు చేలరేగాయి. ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Petal shed burning with electrical short circuit
విద్యుత్ ​షార్ట్ సర్క్యూట్​తో రేకుల షెడ్డు దగ్ధం..
author img

By

Published : Feb 4, 2021, 3:25 PM IST

కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోటూరు తీట్ల వారి వీధిలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. దారం వీరమ్మ రేకుల షెడ్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అవటం వలన మంటలు చేలరేగాయి. ఆ మంటలకు ఇంట్లో ఉన్న గ్యాస్ బండ పెద్ద శబ్ధంతో పేలి.. ఇళ్లు పూర్తిగా కాలిపోయింది.

విద్యుత్ ​షార్ట్ సర్క్యూట్​తో రేకుల షెడ్డు దగ్ధం..

ఆమె వారి బంధువుల ఇంట్లో పడుకొవటానికి వెళ్లింది. మంటలు పక్కనే ఉన్న పాము నాగేశ్వరమ్మ ఇంటికి అంటుకోవడంతో ఆమెది తాటాకుల ఇళ్లు పూర్తిగా కాలిపోయింది. ఆ ఇంట్లో నిద్రించిన నాగేశ్వరమ్మ బయట కేకలు విని వచ్చి చూసేసరికి పక్కనే ఉన్న తీట్ల రంగమ్మ ఇంటికి కూడా మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. తీట్ల బాలకు చెందిన గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఏ విధమైన ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. సకాలంలో గుడివాడ నుంచి ఫైర్ ఇంజన్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు.

ఇదీ చదవండి: వారిని మున్సిపల్ ఉద్యోగులుగా పరిగణించలేం: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.