ETV Bharat / state

టీకా కోసం క్యూలైన్లలో నిరీక్షణ

కరోనా ఉద్ధృతి పెరగడంతో.. వైరస్​ నుంచి రక్షణ కోసం ప్రజలు ముందుకు వస్తున్నారు. టీకా తీసుకునేందుకు పెద్ద సంఖ్యలో కేంద్రాల వద్ద క్యూ కడుతున్నారు. అయితే జిల్లా స్థాయిలో టీకా కొరతతో.. వ్యాక్సినేషన్ కేంద్రాలకు రోజూ వచ్చి.. నిరాశగా వెనక్కి వెళ్లిపోతున్నారు.

vaccination
vaccination
author img

By

Published : Apr 27, 2021, 9:26 AM IST

వాక్సిన్ కోసం అవస్థలు..

జిల్లాల్లో వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. కృష్ణా జిల్లాలో ఇప్పటివరకు.. ఐదు లక్షల 49 వేల 389 మందికి టీకా వేశారు. 4లక్షల 42వేల మందికి మొదటి డోసు వేయగా, రెండో డోసు కేవలం.. లక్షా 6వేల మందికే వేయగలిగారు. మెుదటి డోసు వేయించకున్నవారు.. రెండో డోసు కోసం రోజు వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్నారు. తొలిడోసు కోవాగ్జిన్ వేయించుకున్న వారికి.. రెండో విడత గడువు దాటినా నిల్వలు లేని కారణంగా.. వేయలేని పరిస్థితి నెలకొంది. ఇటు కొవిషీల్డ్ మొదటి డోసు టీకా వేయించుకున్న వారు కూడా రెండో విడత కోసం తిరుగుతున్నారు. జిల్లాలో162 కేంద్రాల్లో టీకాలు వేస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించినా.. చాలా చోట్ల టీకాలు వేయటం లేదు. అన్ని కేంద్రాలకు టీకాను సర్దుబాటు చేయలేక కేంద్రాల సంఖ్యను కుదించాల్సి వచ్చింది.

ఆరుగంటల నుంచే క్యూలైన్లలో..

విజయవాడ నగరానికి 6 వేల డోసులు మాత్రమే.. కేటాయించారు. కార్పొరేషన్ పరిధిలోని 31పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో టీకా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించినా.. కేవలం 23 ప్రాంతాల్లోనే వ్యాక్సినేషన్ వేశారు. ప్రతి కేంద్రానికి 300 డోసులు రాగా.. టీకాలకు రెట్టింపు సంఖ్యలో క్యూలైన్లలో నిలబడ్డారు. ఎక్కవ మంది టీకా కోసం వస్తుండడంతో..టోకెన్లు ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేశారు. చాలామంది ప్రజలు ఉదయం 6 గంటలకే వచ్చి క్యూలైన్లలో నిలబడుతున్నారు.

కేంద్రాల వద్ద తోపులాట..

విశాఖలో కోవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో.. వ్యాక్సినేషన్​ను వేగవంతం చేశారు. అయితే కొన్నిచోట్ల టీకా నిల్వలు తక్కువగా ఉన్నాయని తెలిసి.. తోపులాటలు జరుగుతున్నాయి. అధికారుల మాత్రం టీకా కొరతలేదని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీకా నిల్వలు పెంచి వ్యాక్సినేషన్​ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మొదటి డోసు వేసుకున్న ప్రజలు కోరుతున్నారు.

ఇదీ చదవండి:

కాశీబుగ్గలో అమానుషం.. ద్విచక్రవాహనంపై మహిళ మృతదేహం తరలింపు..

ఆక్సిజన్​ కొరతతో ఆరుగురు రోగులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.