స్పందన కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి సమస్యలపై దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా.. విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన స్పందనకు.. సొంతింటి కోసం అర్జీలు పెద్ద సంఖ్యలో దాఖలయ్యాయి. గతంలో ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం కింద డబ్బులు చెల్లించి ఇప్పటికీ ఇంటి కోసం నిరీక్షిస్తున్న వారు... దరఖాస్తులు చేసుకుంటున్నారు. గతంలో ఇంటి కోసం అప్పులు చేసి లక్ష రూపాయలు చెల్లించామని....డీడీలు కట్టించుకుని ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ ఇళ్లు ఎక్కడ ఇస్తారో తెలియడంలేదని బాధితులు వాపోతున్నారు. ఈ సమస్య చెప్పుకుందామని కార్పొరేషన్ కార్యాలయానికి వస్తే... రెండు, మూడు నెలల ఆగాలంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని.... అప్పులకు వడ్డీలు ఓ వైపు, ఇంటి అద్దెలు మరోవైపు కట్టలేక దిక్కుదోచని స్థితిలో ఉన్నామని ఆవేదన చెందుతున్నారు.
ఇల్లు కావాలంటూ... నిరుపేదల అర్జీలు
సొంతిల్లు లేని నిరుపేదలు.. స్పందన కార్యక్రమాల్లో ప్రభుత్వానికి తమ సమస్యను విన్నవించుకుంటున్నారు. ఇప్పటికే డీడీలు కట్టినా.. ఎక్కడ ఇల్లు ఇస్తారో తెలియక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన చెందుతున్నారు.
స్పందన కార్యక్రమానికి అన్ని వర్గాల నుంచి సమస్యలపై దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా.. విజయవాడ నగర పాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన స్పందనకు.. సొంతింటి కోసం అర్జీలు పెద్ద సంఖ్యలో దాఖలయ్యాయి. గతంలో ప్రధాన మంత్రి ఆవాస యోజన పథకం కింద డబ్బులు చెల్లించి ఇప్పటికీ ఇంటి కోసం నిరీక్షిస్తున్న వారు... దరఖాస్తులు చేసుకుంటున్నారు. గతంలో ఇంటి కోసం అప్పులు చేసి లక్ష రూపాయలు చెల్లించామని....డీడీలు కట్టించుకుని ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ ఇళ్లు ఎక్కడ ఇస్తారో తెలియడంలేదని బాధితులు వాపోతున్నారు. ఈ సమస్య చెప్పుకుందామని కార్పొరేషన్ కార్యాలయానికి వస్తే... రెండు, మూడు నెలల ఆగాలంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారని.... అప్పులకు వడ్డీలు ఓ వైపు, ఇంటి అద్దెలు మరోవైపు కట్టలేక దిక్కుదోచని స్థితిలో ఉన్నామని ఆవేదన చెందుతున్నారు.
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ పై బురదజల్లడమే జగన్మోహన్రెడ్డి పనిగా పెట్టుకున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకటరావు తెలిపారు విశాఖ జిల్లా అనకాపల్లి జరిగిన ఎమ్మెల్సీ
బుద్ధ నాగ జగదీశ్వర రావు జన్మదిన వేడుకలకు
వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు సీఎం పరిపాలనపై దృష్టి పెట్టకుండా గత ప్రభుత్వం పై లేనిపోని ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని తెలిపారు పాదయాత్ర సమయంలో మహిళలకు 45 ఏళ్ల కు పింఛన్ ఇస్తామని చెప్పారన్నారు దీన్ని అమలు చేయమని అడుగుతుంటే ప్రతిపక్షంపై దురుసుగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు
Body:జగన్మోహన్ రెడ్డి సీఎం స్థాయిలో మాట్లాడటం లేదన్నారు
వాడే భాష హావభావాలు ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు వ్యక్తులు ప్రైవేట్ గా ఉన్నప్పుడు ఎలా ఇచ్చినా పర్వాలేదని కానీ పబ్లిక్ లో ఉన్నప్పుడు ఆడిన మాట వాడిన భాష అంతా గమనిస్తారని గుర్తుంచుకోవాలని హితవు పలికారుConclusion:సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి పీలా గోవింద సత్యనారాయణ పాల్గొన్నారు