ETV Bharat / state

'చంద్రబాబు విజనరీ లీడర్' - న్యూజిలాండ్‌ ప్రధాని ప్రశంసల జల్లు

న్యూజిలాండ్‌ ప్రధాని క్రిస్టోఫర్‌ లక్సన్‌తో టీడీపీ ఎమ్మెల్యేల భేటీ - చంద్రబాబు నేతృత్వంలో ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తోందన్న క్రిస్టోఫర్‌ లక్సన్‌

TDP_MLAs_Met_New_Zealand_PM
TDP MLAs met New Zealand PM (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2024, 4:59 PM IST

TDP MLAs met New Zealand Prime Minister : న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్​తో పర్చూరు, బాపట్ల టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, వేగేశన నరేంద్ర వర్మ భేటీ అయ్యారు. మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్, న్యూజిలాండ్ ఎన్నారై టీడీపీ ఆహ్వానం మేరకు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన ఎమ్మెల్యేలు, న్యూజిలాండ్ ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ప్రధానితో ఎమ్మెల్యేలు ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధికి చేస్తున్న కీలక అంశాలను ప్రధానమంత్రికి వివరించారు.

TDP_MLAs_Met_New_Zealand_PM
TDP MLAs met New Zealand PM (ETV Bharat)

ఆంధ్రప్రదేశ్ నుంచి న్యూజిలాండ్​కు కియా కార్లు: దీంతో ఆయన సీఎం చంద్రబాబు తనకు చాలా బాగా తెలుసునని, మంచి విజనరీ లీడర్ అని కితాబిచ్చారు. చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు సారథ్యంలో నెలకొల్పిన కియా మోటార్స్ కార్లు ఆంధ్రప్రదేశ్ నుంచి న్యూజిలాండ్​కు వస్తున్నాయని ఎమ్మెల్యే ఏలూరి, నరేంద్ర వర్మలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్​ను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నూతన సంస్కరణలు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేపడుతున్నారని చెప్పారు.

వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్​ పర్యటన: దీనికి తోడు పారిశ్రామిక అభివృద్ధికి పెద్దపేట వేస్తున్నట్లు ఎమ్మెల్యేలు వివరించారు. చంద్రబాబు అపార అనుభవం, ముందుచూపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ వరం అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు రావాలని ప్రధానమంత్రి లక్సన్​ను ఎమ్మెల్యేలు ఏలూరి, నరేంద్ర వర్మ ఆహ్వానించారు. ఈ మేరకు మార్చిలో అమరావతి పర్యటనకు వస్తానని ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మీ వంతుగా కృషి తోడ్పాటు అవసరమని, పెట్టుబడులతో వచ్చేవారికి చంద్రబాబు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నట్లు వివరించారు.

న్యూజిలాండ్ నుంచి ఏపీకి భారీ పరిశ్రమలను నెలకొల్పేందుకు ప్రధానమంత్రిని ఎమ్మెల్యేలు ఆహ్వానించారు. తొలుత ఎమ్మెల్యేలు ప్రధానమంత్రికి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేలతో పాటు న్యూజిలాండ్ నేషనల్ పార్టీ ప్రతినిధులు శివ కిలారి, బాల వేణుగోపాల్ వీరం, టీడీపీ న్యూజిలాండ్ కోఆర్డినేటర్ జితేందర్ నిమ్మగడ్డ, మన ఆంధ్ర తెలుగు అసోసియేషన్ నేతలు మద్దుకూరి దిలీప్, అశోక్ గోరంట్ల, న్యూజిలాండ్ ఎన్నారై టీడీపీ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.

టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో శిక్షణ-107 మందికి విదేశాల్లో ఉద్యోగాలు - NRI TDP Teachers

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.