కృష్ణా జిల్లా నందిగామ కావేరి రెస్టారెంట్లో ఉద్రిక్తత నెలకొంది. సప్లై చేసే వ్యక్తి జేబులో ఉన్న పర్సును తీయటానికి న్యాయవాది కోట రాజు ప్రయత్నించడంతో వివాదం తలెత్తింది. దీంతో కోటరాజుకు సప్లయర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే సప్లయర్‌పై కోటరాజుకు చెందిన మరికొంత మంది వ్యక్తులు దాడి చేశారు.
హోటల్ నిర్వహకులు సైతం ప్రతిదాడి చేయడంతో.... ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెస్టారెంట్ నిర్వాహకులు, సప్లయర్‌పై... న్యాయవాది కోటరాజు నందిగామ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: చెవిరెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు..: ఎమ్మెల్సీ అశోక్ బాబు