కృష్ణా జిల్లా పెనుగొంచి ప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం మాజీ ఛైర్ పర్సన్ నూతలపాటి సుగుణమ్మ అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. 2003 నుంచి 2005 వరకు చైర్ పర్సన్ గా విధులు నిర్వర్తించి ఆలయ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించారు. 1983 నుంచి తెలుగుదేశం పార్టీలో సుగుణమ్మ క్రియాశీల నాయకురాలిగా పని చేశారు. ఆమె మృతి పట్ల మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య, ఎమ్మెల్సీ తొండపు జనార్ధన్ సంతాపం తెలిపారు.
ఇవీ చూడండి-ఇటీవల మృతి చెందిన తెదేపా నేతలకు సిడ్నీలో నివాళులు