కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో శ్రీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లు మొదలయ్యాయి. అమ్మవారి మండల దీక్షలు తీసుకున్న భక్తులు వేలాదిగా తరలివచ్చి ఆలయం వద్ద ఇరుముడి సమర్పించారు. ఆలయ ఈవో మూర్తి, సర్పంచి వేల్పుల పద్మ కుమారి తిరునాళ్లను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాత్రి 9 గంటలకు తిరుపతమ్మ గోపయ్య స్వాముల కల్యాణోత్సవం జరిపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. తెల్లవారుజాము నుంచే భారీగా భక్తులు తరలివచ్చి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇరుముడి సమర్పించేందుకు వచ్చిన భక్తులకు ఆడిటోరియంలో అన్న సమారాధన నిర్వహించారు. భక్తులకు అవసరమైన వసతులు కల్పించారు. మున్నేరులో నీరు లేకపోవడంతో ప్రత్యేకమైన జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ.. ఉద్యమహోరు