ఇవీ చదవండి..
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడె ప్రసాద్‌కు అస్వస్థత - అస్వస్థత
కృష్ణా జిల్లా పెనమలూరు తెదేపా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బోడె ప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. ప్రచారం చేస్తుండగా వడదెబ్బతో ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన అనుచరులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
బోడె ప్రసాద్
కృష్ణా జిల్లా పెనమలూరు తెదేపా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీచేస్తున్న బోడె ప్రసాద్ అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పగలంతా కంకిపాడులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సాయంత్రం ప్రచారం చేస్తుండగా ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన అనుచరులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తాడిగడపలోని క్యాపిటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన డీహైడ్రేషన్, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
ఇవీ చదవండి..
sample description