ETV Bharat / state

పోతిరెడ్డిపాడుపై కేంద్రమంత్రికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఫోన్​ - pothireddypadu latest news

పోతిరెడ్డిపాడు విషయమై కేంద్ర జల్​ శక్తి శాఖ మంత్రితో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్​రెడ్డి ఫోన్​లో మాట్లాడారు. కృష్ణా నది నుంచి అధిక నీటి తరలింపుపై ఏపీ జీవో గురించి కేంద్ర మంత్రికి ఉత్తమ్‌ వివరించారు. 80 వేల క్యూసెక్కులు తరలిస్తే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. నాగార్జునసాగర్‌ ఆయకట్టు కూడా దెబ్బతింటుందని పేర్కొన్నారు. తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు.

uttamkumar complaint to JalShakti minister on pothireddypadu
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు , కేంద్ర జలశక్తి మంత్రి గజేందర్‌ సింగ్‌ షెకావత్
author img

By

Published : May 14, 2020, 10:59 PM IST

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి ఆంద్రప్రదేశ్‌ రాష్ట్రం ఎక్కువ నీటిని తరలించేందుకు జీవో జారీ చేసిందని కేంద్ర జలశక్తి మంత్రి గజేందర్‌ సింగ్‌ షెకావత్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా నది నుంచి అధికంగా నీటిని మళ్లించేందుకు ముందుకెళ్లుతున్న తీరుపై లేఖరాసిన ఆయన ఇవాళ సాయంత్రం ఫోన్‌లో మంత్రితో మాట్లాడారు.

ఏపీ జీవో అమలైతే తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి నష్టం వాటిళ్లుతుందో... కేంద్రమంత్రికి ఉత్తమ్‌ వివరించారు. 80వేల క్యూసెక్కులు పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి తరలించుకుపోతే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నాగార్జన సాగర్‌ ఆయకట్టు కూడా దెబ్బతింటుందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఉత్తమ్‌... తక్షణమే జోక్యం చేసుకొని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా తగిన చొరవ చూపాలని కోరారు.

ఇదీ చదవండి:

విద్యుత్​ తీగలు తగిలి.. 'కూలీ'పోయిన జీవితాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.