ETV Bharat / state

వరద బాధిత ప్రాంతాల్లో.. 2 నుంచి పవన్ కల్యాణ్ పర్యటన - పవన్ పర్యటన వార్తలు

తుపాను మూలంగా నష్టపోయిన రైతులను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. డిసెంబరు 2 నుంచి 5వ తేదీ వరకు 4 జిల్లాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలిస్తారు.

pawan kalyan
pawan kalyan
author img

By

Published : Nov 30, 2020, 7:42 PM IST

నివర్ తుపాను కారణంగా పంటలు కోల్పోయిన రైతాంగాన్ని పరామర్శించి... వారి కష్టాలను స్వయంగా తెలుసుకొనేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నాలుగు రోజులపాటు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టనున్నారు. డిసెంబరు 2న కృష్ణా, గుంటూరు జిల్లాల్లో... 3, 4, 5 తేదీల్లో చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. 2వ తేదీన ఉదయం 9.30 గంటలకు కృష్ణా జిల్లా ఉయ్యూరు చేరుకుంటారు. అక్కడి నుంచి పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ ప్రాంతాలకు వెళ్లనున్నారు. ఆయా ప్రాంతాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించి అక్కడి రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం పులిగడ్డ వంతెన మీదుగా గుంటూరు జిల్లాకు చేరుకొని భట్టిప్రోలు, చావలి, పెరవలి ప్రాంతాల మీదుగా తెనాలి, నందివెలుగు, కొలకలూరుల్లో పర్యటించనున్నారు.

3వ తేదీన తిరుపతి చేరుకుంటారు. చిత్తూరు జిల్లాలో పంట నష్టంపై జనసేన నాయకులతో చర్చిస్తారు. 4వ తేదీన శ్రీకాళహస్తి ప్రాంతంలో పర్యటించి అక్కడి రైతాంగాన్ని కలవనున్నారు. అక్కడి నుంచి నాయుడుపేట, గూడూరు మీదుగా నెల్లూరు చేరుకుంటారు. 5వ తేదీన నెల్లూరు, రాపూరు, వెంకటగిరి ప్రాంతాల్లో పర్యటిస్తారని జనసేన నేతలు ప్రకటించారు.

ఇదీ చదవండి:

ఇదో ఫ్రాడ్ ప్రభుత్వం.. ఆయనో ఫేక్ సీఎం: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.