ETV Bharat / state

దేశవ్యాప్తంగా వైద్యవిద్యాసీట్ల భర్తీకి... ఒక్కటే పరీక్ష

వచ్చే ఏడాది నుంచి దేశవ్యాప్తంగా ఉన్న వైద్య విద్యాసీట్ల భర్తీకి మార్గం సులువు కానుంది. నీట్‌తో పాటుగా ఎయిమ్స్‌, జిప్‌మర్‌ సంస్థలకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఇకపై మూడింటికి కలిపి ఒకే పరీక్షను నిర్వహించనున్నారు..

author img

By

Published : Dec 6, 2019, 4:50 AM IST

దేశవ్యాప్తంగా వైద్యవిద్యాసీట్ల భర్తీకి... ఒక్కటే పరీక్ష
దేశవ్యాప్తంగా వైద్యవిద్యాసీట్ల భర్తీకి... ఒక్కటే పరీక్ష

వచ్చే విద్యాసంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని వైద్య విద్యాసీట్ల భర్తీకి ఒక్కటే పరీక్ష ఉండనుంది. ఇప్పుడు నీట్‌తో పాటుగా ఎయిమ్స్‌, జిప్‌మర్‌ సంస్థలకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఇకపై మూడింటినీ ఒకటే గొడుగు కిందకు తీసుకురానున్నారు. ఈ కొత్త విధానం వల్ల తెలుగు విద్యార్థులకు ఎయిమ్స్‌, జిప్‌మర్‌కు వెళ్లేందుకు ఎక్కువ అవకాశముంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఒక్క పరీక్షతో.... ఎక్కడైన జాయిన్ అవ్వచ్చు.
దేశంలోని ఏ వైద్య విద్యాసంస్థలో చేరాలనుకునే వారెవరైనా సరే ఇకపై కేవలం ఒక్క పరీక్ష రాస్తే చాలు..ఎయిమ్స్‌, జిప్‌మర్‌లలో సైతం సీటు పొందవచ్చు. ప్రస్తుతం వైద్య విద్యప్రవేశాలకు ఆయా సంస్థల ఆధారంగా నీట్‌, ఎయిమ్స్‌, జిప్‌మర్‌ పేరిట.... 3వేర్వేరు ప్రవేశ పరీక్షలు రాయాల్సి వస్తోంది. వీటి ప్రశ్నాపత్రాల సరళి వేటికవే భిన్నంగా ఉంటుండటంతో విద్యార్థులు వేర్వేరుగా సన్నద్ధమవాల్సి వస్తోంది.

సన్నద్ధతకు మరింత ఈజీ
ఒకే పరీక్ష పెట్టాలనే ప్రతిపాదనతో సన్నద్ధత సులువై విద్యార్థులపై భారం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఐతే.. ఈ కొత్త పరీక్షావిధానంలో వచ్చే ప్రశ్నపత్రం ఏ సరళిలో ఉంటుందో...ఎంత కఠినంగా ఉంటుందో అంచనా వేయడం కాస్త కష్టమేనంటున్నారు.

ప్రవేశానికి మార్గం సులువు
కొత్త పరీక్షావిధానంతో ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ప్రవేశానికి తమకు మార్గం సులువవుతుందని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయం స్వాగతించదగినదేనని విద్యారంగ నిపుణులు చెప్తున్నారు.

ఇవీ చదవండి

ఎయిమ్స్​లో సీట్లు పెరుగుతున్నాయ్!

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.