కృష్ణా జిల్లా పెడనలో ఓ వృద్ధురాలు ఆత్మహత్యకు యత్నించింది. కన్నకొడుకులు సరిగ్గా చూడకపోవటంతో మనస్తాపానికి గురై కాలువలోకి దూకింది. పట్టణ పరిధిలోని బ్రహ్మపురానికి చెందిన పైడిమర్రి మహాలక్ష్మిని కొడుకులు పట్టించుకోవడంలేదు. పైగా సూటిపోటి మాటలతో వేధిస్తున్నారు.
ఈ క్రమంలో మనస్తాపానికి గురైన వృద్ధురాలు స్థానిక పోలీస్ స్టేషన్ పక్కనఉన్న కాల్వలోకి దూకింది. ఇది గమనించిన ఇద్దరు యువకులు ఆమెను కాపాడారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పెడన ఎస్సై మురళి కేసును దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగానే ఆమె ఆత్మహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చదవండి..