కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో అన్ని శాఖల అధికారులతో స్థానిక ఎం.పి.డి.వో కార్యాలయంలో తహసీల్దార్ కె. మస్తాన్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. జూదం వల్ల వలన కలిగే నష్టాలు ప్రజలకు తెలియజేయాలని అధికారులకు తెలిపారు. చట్ట వ్యతిరేకమైన కోడిపందాలు, పేకాట, పిక్కలాట, కోత ఆట, లాటరీ ఆటలు ఆడొద్దని సాంప్రదాయ క్రీడలు మాత్రమే నిర్వహించుకోవాలని సూచించారు. 144 సెక్షన్ ఉండటం వల్ల ఐదుగురు కన్నా ఎక్కువ మంది గుమిగూడరాదని తెలిపారు. మహిళా పోలీసులు వాలంటీర్ల సాయంతో గ్రామాల్లో నిఘా పటిష్టం చేయాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చదవండి: 'స్వార్థ రాజకీయాల కోసమే మా మధ్య అంతరాలు సృష్టిస్తున్నారు'