ETV Bharat / state

కేంద్రం ఇచ్చే రాయితీ కొంతే - సెకి విద్యుత్‌కు ఐఎస్‌టీఎస్‌ ఛార్జీలు చెల్లించాల్సిందే! - YSRCP GOVT DEAL WITH SECI

కేంద్రం ఇచ్చే రాయితీ కొంతే - ఒక్కో మెగావాట్‌కు లభించే రాయితీ రూ.4 లక్షలే

YSRCP Govt Deal With SECI
YSRCP Govt Deal With SECI (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 27, 2024, 10:11 AM IST

YSRCP Govt Deal With SECI : సెకి విద్యుత్‌కు ఐఎస్​టీఎస్ ఛార్జీల విషయంలో గత వైఎస్సార్సీపీ సర్కార్ చెప్పినవన్నీ అవాస్తవాలేనని తేలింది. ఈ ఛార్జీల విషయంలో కేంద్రం ఇచ్చే రాయితీ కొంత మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కో మెగావాట్‌కు లభించే రాయితీ రూ.4 లక్షలేనని తెలిపారు. ప్రతి మెగావాట్‌కు సంవత్సరానికి రూ.52 లక్షలు కట్టాల్సిందేనని తేల్చారు. ఒక ఏడాదిలో పడే ఐఎస్​టీఎస్ భారం రూ.3757 కోట్లుగా ఉంటుందని ఏటా 4 శాతం పెరిగితే పాతికేళ్లలో రూ.1.56 లక్షల కోట్ల భారం పడుతుందని నిపుణులు నిగ్గు తేల్చారు.

ఒక రాష్ట్రంలో ఉత్పత్తైన విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు నేషనల్‌ పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌కు చెందిన లైన్‌లు వాడుకున్నందుకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఐఎస్‌టీఎస్‌ ఛార్జీలు అంటారు. కరెంట్ వినియోగించుకునే రాష్ట్రాలపైనే ఈ భారం పడుతుంది. పీపీఏలు కుదుర్చుకున్నప్పుడు ఈ ఛార్జీలను కూడా కలిపే యూనిట్‌ ధరను నిర్ణయించాలి. సెకి నుంచి తీసుకునే కరెంట్​కు కేంద్ర ప్రభుత్వం ఐఎస్‌టీఎస్‌ ఛార్జీల నుంచి పూర్తి మినహాయింపు ఇస్తుందని అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెగ ఊదరగొట్టింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దిష్ట కాలంలో ఎంత విద్యుత్‌ను డ్రా చేసుకునేందుకు నేషనల్‌ పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌కు చెందిన లైన్‌లను ఎంత మేరకు వాడుకుంది, దానిలో ఐఎస్‌టీఎస్‌ మినహాయింపు వర్తించే పునరుత్పాదక ప్రాజెక్టుల నుంచి వచ్చిన విద్యుత్‌ ఎంత శాతం అన్నది లెక్కిస్తారు.

హార్ట్ ఎటాక్​ను నిరోధించే కాప్స్యూల్‌ - బాపట్ల ఫార్మసీ కళాశాల బృందానికి పేటెంట్‌

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం ఐఎస్‌టీఎస్‌ ఛార్జీల్లో 10 శాతం మాత్రమే మినహాయింపు వర్తిస్తోంది. సెకి నుంచి తీసుకునే 7000ల మెగావాట్లను కలిపినా ఈ మినహాయింపు 20 శాతానికి మించదని నిపుణుల అంచనా. సోషలైజేషన్‌ ఛార్జీలను లెక్కించాక ఏపీకి ఇచ్చే మినహాయింపు ఆ 20 శాతం కూడా ఉండదని నిపుణులు అంటున్నారు. ఒక రాష్ట్రం గడచిన మూడేళ్లలో సెంట్రల్‌ లైన్‌ల ద్వారా ఎంత విద్యుత్‌ తీసుకుందో వాటి సగటు లెక్కించి దాన్ని ఆ రాష్ట్ర కాంట్రాక్టెడ్‌ కెపాసిటీగా నిర్ణయిస్తారు.

జలాశయాల్లో ఆడుకుందామనుకుంటున్నారా? - అయితే షికారుకు సిద్దంకండి

YSRCP Govt on SECI Deal : 2024లో ఆంధ్రప్రదేశ్‌ కాంట్రాక్టెడ్‌ కెపాసిటీ 4516 మెగావాట్లు. కానీ ఆయా రాష్ట్రాల కాంట్రాక్టెడ్‌ కెపాసిటీ ఎంతుంటే అంత విద్యుత్‌ను కచ్చితంగా డ్రా చేయాలన్న నియమం లేదు. వాటి అవసరాన్ని బట్టి తీసుకుంటాయి. తమకు ఏ సమయంలో ఎంత కరెంట్ కావాలన్నదానిపై ప్రతి రాష్ట్రం ఒక షెడ్యూల్‌ను ఇస్తుంది. కాంట్రాక్టెడ్‌ కెపాసిటీలో 75 శాతానికి గానీ, ఆ రాష్ట్రం ఇచ్చిన షెడ్యూల్‌లో పేర్కొన్న మొత్తానికి గానీ ఏది ఎక్కువైతే దాన్నిబట్టి ఐఎస్‌టీఎస్‌ ఛార్జీలు వర్తింపజేస్తారు.

కూర వండి యూట్యూబ్​లో వీడియో పెట్టాడు - కట్​ చేస్తే పోలీసులు అరెస్టు చేశారు!

ఒక రాష్ట్రానికి సెంట్రల్‌ లైన్‌ల ద్వారా ప్రతి పావుగంటకు సరఫరా అయిన విద్యుత్‌లో పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి వచ్చిన కరెంట్ ఎంత శాతం ఉందో లెక్కించి దాన్నిబట్టి ఐఎస్‌టీఎస్‌ ఛార్జీల నుంచి ఎంత రాయితీ వస్తుందో లెక్కిస్తారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం సగటున 3387 మెగావాట్లకు ఐఎస్‌టీఎస్‌ చెల్లించాలి. దీనిలో పునరుత్పాదక విద్యుత్‌పై వస్తున్న రాయితీ 10.046 శాతం ఉంది. ఈ రాయితీని మొత్తం 3387 మెగావాట్లకూ వర్తింపజేస్తారు.

రుషికేశ్‌కు శారదా పీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర!

ఐఎస్‌టీఎస్‌ ఛార్జీలు కట్టాల్సిందే : మళ్లీ సోషలైజేషన్‌ నిబంధన ప్రకారం వివిధ రాష్ట్రాలకు ఇచ్చే రాయితీల్లో హెచ్చుతగ్గులను సర్దుబాటు చేస్తారు. అప్పుడు నికరంగా రాష్ట్రానికి లభించే రాయితీ మరింత తగ్గుతుంది. సెకి నుంచి 7000ల మెగావాట్‌ల విద్యుత్‌ను తీసుకుంటే పునరుత్పాదక విద్యుత్‌పై ఇచ్చే రాయితీ సుమారు 20 శాతం వరకు ఉంటుందని అంచనా. మిగతా 80 శాతం ఐఎస్‌టీఎస్‌ ఛార్జీలనూ ఏడు వేల మెగావాట్లకు కూడా చెల్లించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సోషలైజేషన్‌ తర్వాత. నికరంగా వర్తించే రాయితీ ఇంకా తగ్గిపోతుంది. నికరంగా ఒక్కో మెగావాట్‌కు రూ.4 లక్షల వరకు రాయితీ లభిస్తుందని సెకి నుంచి వచ్చే ఏడు వేల మెగావాట్లకు కూడా మెగావాట్‌కు రూ.52 లక్షలు చొప్పున ఐఎస్‌టీఎస్‌ ఛార్జీలు కట్టాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

'నేనేం భయపడటం లేదు'-వీడియో విడుదల చేసిన వర్మ

సెకి విద్యుత్‌పై కేవలం ఐఎస్‌టీఎస్‌ ఛార్జీల రూపంలోనే యూనిట్‌కు రూ.2.21 చొప్పున భారం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఏడాదికి 1700 కోట్ల యూనిట్ల చొప్పున తొలి ఏడాదిలో పడే భారం సుమారు రూ.3757 కోట్లు. ఏటా కనీసం 4 శాతం చొప్పున ఐఎస్‌టీఎస్‌ ఛార్జీలు పెరుగుతాయన్నది అంచనా. ఆ లెక్కన పాతికేళ్ల ఒప్పంద కాలంలో కేవలం ఐఎస్‌టీఎస్‌ ఛార్జీల రూపంలోనే రాష్ట్రంపై పడే అదనపు భారం రూ.1.56 లక్షల కోట్లకుపైనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన శ్వేతపత్రంలో కూడా ఒక మెగావాట్‌కు రూ.50 లక్షల చొప్పున సంవత్సరానికి రూ.3500 కోట్ల మేర ఐఎస్‌టీఎస్‌ భారం పడుతుందని నిపుణులు పేర్కొన్నట్లుగా ఉంది. ఇతర నిపుణులు కూడా ప్రజలపై భారం తప్పదని హెచ్చరిస్తున్నారు.

'పుష్ప' మూవీ యాక్టర్ శ్రీతేజ్‌పై కేసు నమోదు

ప్రజల్ని వంచించడమే : రాష్ట్రంపై ఇంత భారం పడుతుందని అప్పట్లోనే పలువురు నిపుణులు హెచ్చరించారు. అయినా వినని వైఎస్సార్సీపీ ప్రభుత్వం సెకి నుంచి కొనుగోలు చేసే 7000ల మెగావాట్ల విద్యుత్‌ ధర యూనిట్‌కు రూ.2.49 మాత్రమేనని చెప్పింది. దానికి ఐఎస్‌టీఎస్‌ ఛార్జీలు వర్తించవని కేంద్ర ప్రభుత్వం వాటికి పూర్తి మినహాయింపునిచ్చిందని పేర్కొంది. కాబట్టి సెకి విద్యుత్‌ చాలా చౌకని అడ్డగోలు వాదన చేసింది. వాస్తవాల్ని పరిశీలిస్తే అప్పటి జగన్‌ సర్కార్, వైఎస్సార్సీపీ నాయకులు చెప్పింది పచ్చి అబద్ధమని తేలింది. ఇది ముమ్మాటికీ ప్రజల్ని వంచించడమేనని తేటతెల్లమైంది.

సెకి దస్త్రం పరుగులు - 7 గంటల్లోనే ఆమోదం

సెకితో సౌరవిద్యుత్‌ కొనుగోలు ఒప్పందం - అధిక ధర ఎందుకంటే - అడ్డగోలు వాదన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.