కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మరో కరోనా కేసు నమోదైంది. అధికారులు, పోలీసులు.. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ.. అనుమానితులను పరీక్షిస్తున్నారు. చిలకలపూడి జంక్షన్ నుంచి పట్టణంలోని అన్ని కూడళ్ల వద్ద థర్మో స్కానర్లు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరినీ స్కాన్ చేస్తూ పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా మృతి చెందిన వ్యక్తి బంధువుకు కూడా పాజిటివ్ వచ్చిన కారణంగా.. ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. రాకపోకలు కట్టడి చేస్తున్నారు.
ఇవీ చూడండి: