శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అశ్లీల నృత్యాలు నిర్వహించిన 40 మందిపై స్థానిక టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై షణ్ముకసాయి తెలిపిన కథనం ప్రకారం.. కృష్ణాజిల్లా కైకలూరు మండలం తామరకొల్లు గ్రామంలో రెండు రామాలయాల కమిటీల ఆధ్వర్యంలో నిర్వహించిన ఊరేగింపులో కొందరు యువకులు అశ్లీల నృత్యాలు నిర్వహించారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆలయ కమిటీ సభ్యులు, ట్రాక్టర్ యజమానులు, హిజ్రాలపై కేసునమోదు చేశామని, డీజే బాక్సులు సీజ్ చేశామని ఎస్సై తెలిపారు.
ఇదీ చదవండి: