OBEROY GROUP COO RAJA RAMAN MET CM JAGAN: రాష్ట్రంలో రూ.15వందల కోట్ల పెట్టుబడులు పెట్టడమేగాక.. ప్రత్యక్షంగా 15వందల మందికి, పరోక్షంగా 11వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఓబెరాయ్ గ్రూప్ ముందుకు వచ్చింది. రాష్ట్రంలో విశాఖ, తిరుపతి, గండికోట, పిచ్చుకలంక, హర్సిలీహిల్స్‌లో హోటళ్లు ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ఆసక్తి చూపించింది. దీనితోపాటు పాడేరు పరిసర ప్రాంతాల్లో టూరిజం సెంటర్ నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నామని ద ఓబెరాయ్ గ్రూప్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాజారామన్ శంకర్ సీఎం వైఎస్ జగన్‌కు తెలిపారు.
తాడేపల్లి లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన ముఖ్యమంత్రిని కలిశారు. రాష్ట్రంలో ఓబెరాయ్ గ్రూప్ హోటల్స్ ప్రణాళికల గురించి రాజారామన్ శంకర్ సీఎంకి వివరించారు. అన్ని హోటల్స్‌లోనూ సెవెన్ స్టార్ సౌకర్యాలతో విల్లాల మోడల్‌లో రూపకల్పన చేస్తామని చెప్పారు. ఓబెరాయ్ ప్రాజెక్ట్‌లకు అవసరమైన అనుమతులన్నీ సింగిల్ విండో విధానంలో ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
ఇవి చదవండి: