ETV Bharat / state

ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థికి నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘన నివాళులు - విద్యార్థి పరమేష్​కు నివాళులర్పించిన ఆర్జీయూకేటీ కులపతి కె.సి.రెడ్డి

విద్యార్థి పరమేష్ మృతికి కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐఐఐటీలో విద్యార్థులు, అధ్యాపకులు రెండు నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. అతడి ఆత్మహత్య ఎంతగానో బాధించిందని ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కె.సి. రెడ్డి తెలిపారు. విద్యార్థుల మానసిక స్థితి, ప్రవర్తనను పరిశీలించేందుకు ఓ కమిటీని నియమించనున్నట్లు ప్రకటించారు.

rgukt chancellor tributes to suicide student in nuziveedu iiit
నూజివీడు ఐఐఐటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థికి ఆర్జీయూకేటీ కులపతి కె.సి.రెడ్డి నివాళులు
author img

By

Published : Feb 13, 2021, 10:51 PM IST

కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్​ ఐటీ విద్యార్థి టి.పరమేష్ చిత్రపటానికి పూలమాల వేసి.. అతడి మృతికి ఆర్జీయూకేటీ కులపతి ఆచార్య కె.సి. రెడ్డి ఘన నివాళులర్పించారు. విద్యార్థి ఆత్మకు శాంతి చేకూరాలని క్యాంపస్​లోని విద్యార్థులు, అధ్యాపకులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. పరమేష్ ఆత్మహత్య ఎంతగానో బాధించిందని కె.సి. రెడ్డి తెలిపారు. తోటి విద్యార్థులు, అధ్యాపకులు అతడి మానసిక స్థితిని అంచనా వేయగలిగినా.. ప్రవర్తనలో మార్పు గమనించినా ఇంతటి అనర్థం జరిగేది కాదన్నారు. ఈ దుర్ఘటన అందరికీ కనువిప్పు కలిగించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధ్యాపకులు, విద్యార్థులు కృషి చేయాలన్నారు.

విద్యార్థుల మానసిక స్థితి, ప్రవర్తనా తీరుపై ప్రత్యేక దృష్టి సారించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఆచార్య కె.సి రెడ్డి వెల్లడించారు. ఏ విద్యార్థి నష్టపోకుండా అనుక్షణం పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని.. దానిని అన్వేషించడం, పరిశోధించడం తక్షణ కర్తవ్యం కావాలని హితవు పలికారు. ఆత్మహత్యల వరకు ఆలోచన చేయకూడదని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

'పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎస్​ఈసీ విఫలం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.