విజయవాడ దుర్గాకళా మందిర్లో ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ఎప్పుడు విజయవాడ వచ్చినా దుర్గా కళామందిర్ థియేటర్లోని అతిథి గృహంలోనే బస చేసేవారని ప్రముఖ పారిశ్రామికవేత్త కోగంటి సత్యం గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బాలి గోవింద్ పాల్గొన్నారు.
పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్, పోరంకి సెంటర్లో పెనమాలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మధ్యమ నియోజకవర్గ కార్యలయంలో పోలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు ఆర్పించారు. కేక్ కట్ చేసి రాష్ట్రానికి ఎన్టీఆర్ చేసిన సేవలను స్మరించుకున్నారు.
నందిగామలో ఎన్టీఆర్ జయంతి ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేశారు. ఆయన సేవలను నాయకులు కొనియాడారు. ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు ,రొట్టెలు పంపిణీ చేశారు .
ఇదీ చదవండి: విజయవాడలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి.. తెదేపా నేతల నివాళి