ఎన్టీఆర్ ఆరోగ్య వైజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి సీవీ రావు.. బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. పదవికి రాజీనామా చేశారు. రాజ్ భవన్లో గవర్నర్ బిశ్వభూషణ్‌కు రాజీనామా సమర్పించారు. అనారోగ్య సమస్యే తన నిర్ణయానికి కారణమని తెలిపారు. ఈ ఏడాది విశ్వవిద్యాలయంలో వైద్య విద్య కౌన్సిలింగ్ ప్రక్రియలో కొందరు విద్యార్థులకు అన్యాయం జరిగిందని వచ్చిన ఆరోపణలను ఆయన సమర్థంగా ఎదుర్కొన్నారు. కోర్టు సైతం ఎవరికీ అన్యాయం జరగలేదని స్పష్టం చేసింది. ఉపకులపతిగా ఆయన రెండేళ్ల పాటు సేవలందించారు.కొత్త ఉపకులపతి వచ్చే వరకు ఇన్‌ఛార్జి బాధ్యతలను... వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి నిర్వహిస్తారు.
చరిత్రలో మొదటిసారి...!
డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 9వ ఉపకులపతిగా విశాఖపట్నంకు చెందిన డాక్టర్ సి . వెంకటేశ్వ రరావు 2017 సెప్టెంబరు 22న బాధ్యతలు చేపట్టి ఇటీవలే రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. మరొక ఏడాది ఉండగానే నూతన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడిలు వచ్చినట్లు ఆరోపణలున్నాయి. రెండేళ్ల నుంచి సాంకేతికపరంగా విశ్వవిద్యాలయాన్ని ముందుకు తీసుకెళుతున్న ఉపకులపతిని తప్పించి ఓ సామాజిక వర్గానికి పగ్గాలు అప్పగించాలనేది ప్రభుత్వ ఎత్తుగడ అని పలువురు అభిప్రాయపడుతున్నారు. దేశంలోనే మొట్టమొదటి ఆరోగ్య విశ్వవిద్యాలయం చరిత్రలో పదవీ కాలం ముగియకుండానే ఒక ఉపకులపతి రాజీనామా చేయటం ఇదే మొదటిసారి కావటం గమనార్హం.
ఇదీ చూడండి: