ETV Bharat / state

ప్రైవేటు బడులకు పుస్తకాలెక్కడ?.. మార్కెట్‌లో దొరక్క తల్లిదండ్రుల అవస్థలు! - ప్రైవేటు బడులకు పుస్తకాలెక్కడ

No Books In Private Schools: ప్రైవేటు పాఠశాలలు సైతం పాఠ్యపుస్తకాలను తమ వద్దే కొనాలంటూ నిబంధన తెచ్చిన పాఠశాల విద్యాశాఖ.. సరఫరాపై మాత్రం దృష్టిపెట్టడం లేదు. దీంతో పాఠ్యపుస్తకాలు లేకుండానే ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు తరగతులకు హాజరవుతున్నారు.. పాఠశాలలు పునఃప్రారంభించి మూడు వారాలు కావొస్తున్నా ప్రైవేటు పాఠశాలలకు ఇప్పటికీ పుస్తకాలు అందలేదు. ఇవిగో పుస్తకాలు.. అవిగో పుస్తకాలంటూ అధికారులు చెప్పడమే తప్ప విద్యార్థులకు అందుతున్న దాఖలాలు కనిపించడం లేదు.

no books in private schools
no books in private schools
author img

By

Published : Jul 25, 2022, 3:26 AM IST

No Books In Private Schools: ప్రైవేటు పాఠశాలలు సైతం పాఠ్యపుస్తకాలను తమ వద్దే కొనాలంటూ నిబంధన తెచ్చిన పాఠశాల విద్యాశాఖ సరఫరాపై దృష్టిపెట్టడం లేదు. ఫలితంగా పాఠ్యపుస్తకాలు లేకుండానే ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు తరగతులకు హాజరుకావాల్సిన వస్తోంది. పాఠశాలలు పునఃప్రారంభించి మూడు వారాలు కావొస్తున్నా ప్రైవేటు పాఠశాలలకు ఇప్పటికీ పుస్తకాలు అందలేదు. పాత పుస్తకాలతో తరగతిలో బోధన చేస్తున్నా.. వాటిని పునశ్చరణ చేసుకునేందుకు అవకాశం లేకుండాపోయింది. ఇవిగో పుస్తకాలు.. అవిగో పుస్తకాలంటూ అధికారులు చెప్పడమే తప్ప క్షేత్రస్థాయిలో విద్యార్థులకు అందుతున్న పరిస్థితులు కనిపించడం లేదు.

కొన్నిచోట్ల పుస్తకాలు ఇచ్చినా ఏ తరగతికీ పూర్తి స్థాయిలో రాలేదు. పాఠ్యపుస్తకాల కోసం ప్రైవేటు యాజమాన్యాలు ఆన్‌లైన్‌లో ఇండెంట్‌ పెట్టినా పూర్తిగా సరఫరా కావడం లేదు. మండల, జిల్లా విద్యాధికారులను ఎవర్ని కలిసినా సరైన సమాధానం చెప్పడం లేదని కడప జిల్లాకు చెందిన ఓ యాజమాన్యం వెల్లడించింది. గతేడాది విద్యార్థుల సంఖ్య ఆధారంగా కొందరు ఆర్డరు పెట్టగా.. ఈసారి విద్యార్థులు పెరిగారు. దీంతో ఇండెంట్‌ను సవరించే అవకాశం కల్పించాలని యాజమాన్యాలు కోరినా దీనికి అవకాశం ఇవ్వడం లేదు. మరోపక్క కొన్ని బడులు మొదట్లో ఇండెంట్‌ పెట్టలేదు. ఇప్పుడు వారు వివరాలు నమోదు చేస్తున్నారు.. వీరికి ఎప్పటికి పుస్తకాలు వస్తాయో తెలియని పరిస్థితి. కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పుస్తకాలతో తమకు సంబంధం లేదని, బయట కొనుక్కోవాలని విద్యార్థుల తల్లిదండ్రులకు సూచిస్తున్నాయి. బయట మార్కెట్‌లో పుస్తకాలు లభించకపోవడంతో తల్లిదండ్రులు దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.

  • గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలను మాత్రమే విద్యాశాఖ ముద్రించేది. బయట మార్కెట్‌లో అమ్ముకునే పుస్తకాల ముద్రణను 5శాతం రాయల్టీ తీసుకుని ప్రైవేటు ప్రింటర్లకు ఇచ్చేవారు. ఈసారి ఇందుకు భిన్నంగా ప్రైవేటు బడులకు విద్యాశాఖే పుస్తకాలను సరఫరా చేస్తోంది. పాఠశాలలకు పునః ప్రారంభానికి ముందు పెట్టిన ఇండెంట్‌ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1.8 కోట్ల పుస్తకాలు అవసరం కానున్నాయి. ఇప్పుడు వీటి సంఖ్య మరింత పెరిగింది. ఇండెంట్‌ పెట్టని ప్రైవేటు పాఠశాలలు తల్లిదండ్రులనే పుస్తకాలు కొనుక్కోవాలని సూచిస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో లక్షలాది మంది విద్యార్థులకు పుస్తకాలు లభించడం లేదు. ఈ ఏడాది ముద్రణకు అనుమతి లభించనందున ప్రైవేటు ప్రింటర్లు మార్కెట్‌లో అమ్మే పుస్తకాలు ముద్రించ లేదు.
  • పుస్తకాల ముద్రణకు పేపర్‌ను సరఫరా చేసే కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థ సకాలంలో అందించలేదు. దీంతో ప్రారంభంలోనే ముద్రణ కొంత ఆలస్యమైంది.
  • ఈ ఏడాది ఎనిమిదో తరగతి సిలబస్‌ మార్పు చేయడంతో పుస్తకాల ముద్రణ ఆలస్యమైంది. ప్రభుత్వ బడులకే ఈ పుస్తకాలు పూర్తిగా అందలేదు. ప్రైవేటు వారికి ఎప్పటికి అందుతాయో తెలియని పరిస్థితి.
  • ఎనిమిదో తరగతి పుస్తకాలు లేకపోవడంతో ప్రైవేటు పాఠశాలల్లో ప్రభుత్వ వెబ్‌సైట్‌ నుంచి పీడీఎఫ్‌లు డౌన్‌లోడ్‌ చేసుకొని, వాటి ఆధారంగా పాఠాలు బోధిస్తున్నారు. తరగతులకు హాజరవుతున్న వారికి పాఠాలు బోధిస్తున్నా పునశ్చరణ చేసుకోవడానికి విద్యార్థుల వద్ద పుస్తకాలు లేవు.
  • పాఠ్యపుస్తకాలను ఈనెల చివరి వరకు విద్యాకానుకలతో కలిపి ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వ బడుల్లోనూ చాలాచోట్ల ఇప్పటికీ పూర్తిస్థాయిలో పుస్తకాలు అందలేదని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల కారణంగా వారు మౌనంగా ఉంటున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 2021-22 ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో కలిపి 72.47లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ప్రభుత్వ పాఠశాలల్లో 44.33లక్షలు, ఎయిడెడ్‌ 1.61లక్షలు, ప్రైవేటులో 26.53లక్షల మంది చదువుతున్నారు. ప్రైవేటులో చదువుతున్న వారిలో దాదాపు 35శాతం మందికే పుస్తకాలు అందాయి.

ఇదీ చదవండి: ఆహార భద్రత ప్రమాణాల్లో .. ఏపీ కి 17వ స్థానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.