ఏపీలో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో 30,678 నమూనాలను పరీక్షించగా 1,326 మందికి కొవిడ్ నిర్ధరణ అయ్యింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 282, గుంటూరు జిల్లాలో 271, విశాఖ జిల్లాలో 222, నెల్లూరు జిల్లాలో 171 కరోనా కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 138, ప్రకాశం జిల్లాలో 54, శ్రీకాకుళం జిల్లాలో 52, కడప జిల్లాలో 31, తూర్పుగోదావరి జిల్లాలో 29, అనంతపురం జిల్లాలో 23 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌లో వెల్లడించింది. తాజా సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 9,09,002 కి చేరింది.
24 గంటల వ్యవధిలో కొవిడ్ చికిత్స పొందుతూ ఐదుగురు మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురం, చిత్తూరు, గుంటూరులో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. తాజా మరణాలతో రాష్ట్రంలో కొవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 7,244కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 911 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం 10,710 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,52,39,114 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం బులెటిన్‌లో పేర్కొంది.
ఇవీ చదవండి