ETV Bharat / state

తెలంగాణలో చోరీలకు పాల్పడుతున్న నేపాల్‌ ముఠా సభ్యులు

తెలంగాణ రాష్ట్రంలో చోరీ చేసి నేపాల్ వెళ్లిపోతారు. దేశం దాటాక సొత్తు పంచుకుని విడిపోయి.. మారుమూల గ్రామాల్లో నివసిస్తారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తారు. కానీ ఇదంతా జరగడానికి సంవత్సరాలు పట్టొచ్చు. హైదరాబాద్‌లోని ఇళ్లలో నమ్మకంగా చేరి అదును చూసి చోరీలకు పాల్పడే కేసులు ఇటీవల బాగా పెరిగాయి. నిందితులపై పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. వారు పోలీసుల కళ్లుగప్పి దేశం దాటేస్తున్నారు.

Nepali gang
తెలంగాణలో చోరీలకు పాల్పడుతున్న నేపాల్‌ ముఠా సభ్యులు
author img

By

Published : Aug 29, 2020, 7:46 PM IST

తెలంగాణ మేడ్చల్ జిల్లా సైనిక్‌పురిలో ఈనెల 3న వ్యాపారి నర్సింహారెడ్డి ఇంట్లో భారీ చోరి జరిగింది. కేసు దర్యాప్తులో ఆ ఇంట్లో పని చేసే నేపాల్‌కు చెందిన వ్యక్తితోపాటు మరో ముగ్గురు చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. దొంగల కోసం రాచకొండ పోలీసులు చేపట్టిన 'ఆపరేషన్ నేపాల్'​లో పలు విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. ముఠా సభ్యులంతా ఒకేచోట ఉండరు. ఒక్కో నగరంలో ఒక్కొక్కరు ఇంటి పనికి చేరతారు. ఎక్కడ గిట్టుబాటు అవుతుంతో తెలిశాకా అందరూ అక్కడికి చేరుకుని సొత్తుతో ఉడాయిస్తారు. ఒక్కసారి దొంగతనం చేసిన నగరంలో తిరిగి మరొకటి చేయరు.

సామాజిక మాధ్యమాల్లోనే

ఫేస్‌బుక్ మెసెంజర్, వైబర్ తదితర సామాజిక మాధ్యమాల్లోనే ముఠా సభ్యులు మాట్లాడుకుంటారు. లూథియానా, నోయిడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ తదితర మెట్రో నగరాల్లోని విలాసవంతమైన ఇళ్లల్లో పనికి కుదిరి నమ్మకంగా పని చేస్తారు. కొద్దిరోజుల తర్వాత ఆకస్మాత్తుగా పని మానేస్తారు. ఇంటికి వెళ్లాలంటూ.. నా స్థానంలో మా బంధువును పనికి కుదుర్చుతానంటూ చెబుతారు. ఆ పేరు మీద అసలు దొంగను రంగంలోకి దింపుతారు. సైనిక్‌పురిలో ఆరు నెలల క్రితం పని చేసిన వ్యక్తి మానేస్తూ.. మరో వ్యక్తిని పనికి కుదిర్చాడు.

ఇదే తరహాలో

ఇంట్లో అంతకు ముందు పని చేసిన ముఠా సభ్యుడు అసలు దొంగకు పూర్తి సమాచారమిస్తాడు. దాని ఆధారంగా ఆ దొంగ సందర్భం చూసి ఆహారంలో నిద్ర మాత్రలు కలుపుతాడు. కాళ్లు చేతులు కట్టేసి బంగారు, వజ్రాభరణాలు, నగదును తీసుకుని ఉడాయిస్తారు. ఈ ఏడాది జనవరిలో కోకాపేటలో ఇదే తరహాలో చోరీకి పాల్పడ్డారు. బయటకు రాగానే ముఠా సభ్యులంతా సొత్తును పంచుకుంటారు. ఒక్కరు దొరికినా మిగిలిన వారు పట్టుబడకుండా ఎవరీ దారిన వాళ్లు నేపాల్‌కు చేరుకుంటారు. అక్కడ వారికి రెండు ఇళ్లులుంటాయి. ఊరిలో ఒకటి, గుట్టలపై మరొకటి. పోలీసులు వచ్చినట్లు సమాచారం రాగానే గుట్టలపై ఉన్న ఇళ్లకు చేరుకుంటారు.

హైదరాబాద్‌ సైనిక్‌పురిలోని ఓ స్థిరాస్తి వ్యాపారి ఇంట్లో రూ.2 కోట్ల వరకు విలువైన బంగారు, వజ్రాభరణాలు చోరీ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాచకొండ పోలీసులు ఏడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నిందితులు ముంబయి నుంచి బస్సులో నేపాలకు పారిపోయినట్లు గుర్తించామని సీపీ తెలిపారు.

ఇదీ చూడండి . కరోనా ఎఫెక్ట్: కొనేవారు లేక మొక్కజొన్న రైతుల అవస్థలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.