కృష్ణా జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కరోనా నుంచి బయటపడేందుకు ఎవరికి వారు స్వీయ రక్షణ చర్యలు తీసుకోవాలని అధికార యంత్రాంగం పదేపదే చెబుతున్నా ప్రజల ధోరణిలో మార్పు రావడం లేదు. ఇంటి నుంచి బయటకి వచ్చేటప్పుడు మాస్కు ధరించాలని ఎన్ని సార్లు చెబుతున్నా బేఖాతరు చేస్తున్నారు.
విజయవాడ నగరంలోని కాళేశ్వరరావు మార్కెట్ లో కనిపిస్తున్న దృశ్యాలు ప్రజల్లో కరోనా పట్ల నిర్లక్ష్యాన్ని చాటుతున్నాయి. మాస్కులు ధరించికపోవడం, సామాజిక దూరం పాటించకపోవడం వంటి కనీస స్వీయ రక్షణ చర్యలు పాటించకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. జిల్లాలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికం విజయవాడ నగరంలోనే ఉంటున్నా మార్కెట్ ప్రాంతాలు కరోనా వైరస్ వ్యాప్తి కేంద్రాలుగా నిలుస్తున్నాయి.
ఇదీ చదవండి:
కరోనా విధుల్లో ఉంటూ.. ప్రాణాలు కోల్పోయిన సిబ్బందికి పవన్ శ్రద్ధాంజలి