కృష్ణాజిల్లా గుడివాడ ఆర్డీవో కార్యాలయం వద్ద దళితులు నిరసన చేపట్టారు. ఒకటో పట్టణ పోలీసులు వేధిస్తున్నారంటూ.. గుడ్మెన్పేటకు చెందిన మార్తా ఏసేబు, కోన మేరీ సహా సుమారు 100 మంది ఎస్సీ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దళితులకు ఒక న్యాయం ఇతరులకు మరొకటా అని నిలదీశారు.
ఇదీ చదవండి: వాహనంపై సీఆర్పీఎఫ్ కాల్పులు- మహిళకు గాయాలు
గత నెల 24న స్థానిక మార్కెట్ వద్ద జరిగిన దాడి ఘటనలో.. ముద్దాయిని విడిచిపెట్టి, బాధితుడు మార్తా వివేక్ కుటుంబ సభ్యులను పోలీసులు వేధిస్తున్నారని నిరసనకారులు ఆరోపించారు. అతడిపై దాడిచేసి అపస్మారక స్థితిలోకి వెళ్లడానికి కారణమైన.. బత్తుల మురళి, పులిపాక మహేష్, బంటితో పాటు వారికి సాయం చేసిన ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేలా చూడాలని ఆర్డీవో గేదెల శీనుకు వినతి పత్రం సమర్పించారు.
ఇదీ చదవండి: