ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం పోర్టు నిర్మాణ బిడ్‌ను... నవయుగ ఇంజినీరింగ్ లిమిటెడ్ సారధ్యంలోని భాగస్వామ్య సంస్థ...దక్కించుకుంది. సాంకేతిక, ఫైనాన్షియల్ బిడ్‌లో ఎల్ 1గా నిలిచిన....నవయుగ ఇంజనీరింగ్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ సంస్థకు పోర్టు నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించనుంది. ఈపీసీ ప్రాతిపదికన రామాయపట్నం పోర్టు నిర్మాణానికి..ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లు పిలిచింది. ఐబీఎమ్ విలువ కంటే 0.5 శాతం తక్కువగా 2634.65 కోట్లకు నవయుగ ఇంజినీరింగ్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ సంస్థ బిడ్ దక్కించుకుందని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇవీ చదవండి