ప్రజలకు నాణ్యమైన ఆహార పదార్థాలను అందుబాటులోకి తీసుకొచ్చి... వినియోగదారుల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం పరిరక్షిస్తుందని పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1986 డిసెంబర్ 24న వినియోగదారుల చట్టం వచ్చిందని... వినియోగదారుల హక్కులను కాపాడేందుకు ఈ చట్టాన్ని మరింత పటిష్ఠంగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు.
అక్కడ ఆలస్యమైతే నష్టపరిహారం...
విదేశాల్లో వినియోగదారుల హక్కులపై చైతన్యం, అవగాహన అధికమని పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ అన్నారు. మన దేశంలో విమానం ఆలస్యం అయినా ఎవరూ అంతగా పట్టించుకోకుండా నిరీక్షిస్తుంటారని... అదే న్యూజిలాండ్‌లో 20 నిమిషాలు ఆలస్యమైతే... అందుకు నష్టపరిహారం వసూలు చేస్తారని తెలిపారు. పది కోట్ల రూపాయల లోపు వినియోగదారుడు నష్టపోతే... జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఫిర్యాదు చెయ్యవచ్చని... అదే పది కోట్లకు మించితే జాతీయ స్థాయిలో ఫిర్యాదు నమోదు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారు వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ టి.సునీల్ చౌదరి, ఆహార భద్రత కమిటీ ఛైర్మన్ జె ఆర్ పుష్పరాజ్, లీగల్ మెటిరాలజీ డైరెక్టర్ ఎం. కాంతారావు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: