గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది నోటిఫికేషన్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తై మెరిట్ లిస్ట్‌లో వున్న అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వాలని సీఎంకు లేఖ రాయడంతో పాటు.. అనేకసార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం స్పందించలేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు.
ఈ రోజు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా విజయవాడలో ఆందోళన చేపట్టిన అభ్యర్థులను, మద్దతు తెలిపిన తెదేపా, ఏఐటీయూసీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చెయ్యడాన్నిలోకేశ్ తీవ్రంగా ఖండించారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన వారికి వెంటనే నియామక పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఎల్ఓసీ వెంబడి భారీ స్థాయిలో ఆయుధాలు పట్టివేత