జస్టిస్ నూతలపాటి వెంకటరమణ దేశ సర్వోన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్‌గా నియమితులవ్వటంపై.. ఆయన స్వగ్రామం పొన్నవరం గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. నందిగామ కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ సభ్యులు మిఠాయిలు పంచుతూ వేడుక చేసుకున్నారు. నందిగామలో సబ్ కోర్టు, జిల్లా కోర్టు, జిల్లా అదనపు కోర్టులను ఏర్పాటు చేయటానికి రమణ చేసిన కృషిని స్మరించుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణ మరింత ఉన్నత స్థానానికి ఎదగాలని వారు ఆకాంక్షించారు.
ఇదీ చదవండీ.. ఉన్నత పీఠంపై ఊరు బిడ్డ.. పులకించిన పురిటి గడ్డ