గ్రామాల్లో నేరాల అదుపునకు గ్రామసచివాలయ మహిళా సంరక్షణాధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని డీఎస్పీ జీ.వి.రమణమూర్తి సూచించారు. కృష్ణా జిల్లా కంచికచర్లలో గ్రామ సచివాలయ మహిళా సంరక్షణాధికారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో నేరాల గురించి చర్చించారు. తల్లిదండ్రుల అనుమతిలేకుండా విద్యార్థులను ఉపాధ్యాయులు బయటకు పంపించవద్దన్నారు. గ్రామాల్లో బెల్టుషాపులు నిర్వహణ, అక్రమ ఇసుక రవాణా గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందజేయాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి: 'సానుకూల నిర్ణయం వచ్చే వరకూ పోరాడతాం'