గడచిన 16 నెలలు నందిగామ డీఎస్పీగా, సమర్థవంతంగా పనిచేసేందుకు తోటి పోలీసులు, ప్రజలు, పాత్రికేయులు ఇచ్చిన సహకారం మరువలేనని జీవీ. రమణ తెలిపారు. కష్టకాలంలో విధులు నిర్వహించాల్సి వచ్చిన అన్నింటినీ అధిగమించి పనిచేయగలిగానని చెప్పారు. ఆయన బదిలీ అయిన సందర్భంగా.. పోలీసులు, పాత్రికేయులు సన్మానించారు.
మరోవైపు.. నందిగామ నూతన డీఎస్పీ నాగేశ్వర్ రెడ్డికి పోలీసులు స్వాగతం పలికారు. సబ్ డివిజన్ లో శాంతి భద్రతలు కాపాడేందుకు పూర్తి స్థాయిలో పని చేస్తానని చెప్పారు.
ఇదీ చదవండి: