కృష్ణా జిల్లా మోపిదేవి మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. మండలంలో 10 స్థానాలకుగాను ఆరుచోట్ల తెలుగుదేశం గెలవగా.. 3 స్థానాల్లో వైకాపా అభ్యర్థులు, ఒకచోట జనసేన అభ్యర్థి విజయం సాధించారు. తెలుగుదేశం నుంచి నడకుదిటి జనార్దనరావు సతీమణి జననీకుమారి, రావి నాగేశ్వరరావు భార్య దుర్గావాణి... అధ్యక్ష పీఠానికి పోటీ పడుతున్నారు. ఇద్దరూ ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. పార్టీ పెద్దలు ఇద్దరికి నచ్చచెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా ఎవరూ తగ్గడం లేదు. తెలుగుదేశంలోని ఒక వర్గం వైకాపా, జనసేన అభ్యర్థులతో మంతనాలు జరుపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నిక సందర్భంగా ఏం జరుగుతుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
చల్లపల్లి మండల పరిషత్ ఎన్నికల సందర్భంగా.. పార్టీ ఎంపీటీసీ ఎంపీటీసీలకు తెలుగుదేశం విప్ జారీ చేసింది. తెలుగుదేశం అధిక స్థానాల్లో గెలిచినా.. చల్లపల్లి మండల పరిషత్‌ను సొంతం చేసుకునేందుకు అధికార వైకాపా ప్రయత్నాలు సాగిస్తోంది. తమ ఎంపీటీసీలను లాక్కుంటారనే ఆందోళనతో ఉన్న తెలుగుదేశం.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మచిలీపట్నం తెదేపా పార్లమెంటరీ మహిళా కార్యదర్శి కృష్ణకుమారి, పార్టీ నేత బత్తిన దాసు.. విప్ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్.వి.భార్గవకు అదించారు.
ఇదీ చదవండీ.. ఒడిశా పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ.. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని ఏపీకి ఆదేశం..