కరోనాను సాకుగా చూపి వినాయక చవితి వేడుకలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం దారుణమని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. మద్యం దుకాణాలకు లేని కరోనా ఆంక్షలు.. దేవాలయాలు, పండగలకు ఎందుకని ప్రశ్నించారు. చవితిని ఇంట్లోనే జరుపుకోవాలని ప్రభుత్వం తెచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. హిందువుల మనోభావాలను ప్రభుత్వ పెద్దలు గౌరవించాలని అన్నారు.
'రోడ్ల దుస్థితిపై పవన్ స్పందనను ఆహ్వానిస్తున్నా. హెలికాప్టర్లలో కాకుండా రోడ్లపై తిరగాలని జగన్‌ను కోరాం. సీఎం గారూ.. మీచుట్టూ ఉండేవారు ప్రజాసమస్యలపై చెప్పట్లేదు. రహదారుల సమస్యపై నిన్నటి సీఎం సమీక్షను ఆహ్వానిస్తున్నా. రహదారులపై సీఎం రాజకీయం చేయడం సరికాదు. మీ పాదయాత్ర సమయంలో ఎక్కడా గోతులు కన్పించలేదు.' -ఎంపీ రఘురామకృష్ణరాజు
అప్పు తప్ప అభివృద్ధి అనే మాట సీఎం నోట వినిపించట్లేదని రఘురామకృష్ణరాజు ఆరోపించారు. ప్రభుత్వ చేతగానితనాన్ని విపక్షాలపై నెట్టవద్దన్నారు. మరమ్మతులకు టెండర్లు పిలిచినా రావట్లేదని అధికారులే చెబుతున్నారని.. రహదారుల కారణంగా ఆర్థోపెడిక్ వైద్యులకు డిమాండ్ పెరిగిందని రఘురామకృష్ణరాజు ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: