రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం మొదలైంది. అభ్యర్థుల తరఫున నాయకులు ప్రచారంలో పాల్గొంటున్నారు. తమ పార్టీకి ఓటు వేయాలని కోరుతున్నారు.
గుంటూరు జిల్లా
గుంటూరు నగరంలో ఎన్నికల సందడి నెలకొంది. గుంటూరు శ్రీనగర్ లో 51 డివిజన్ అభ్యర్థి ముప్పవరపు భారతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటిఇంటికి వెళ్లి తమ పార్టీకి ఓటు వేయాలని కోరారు. తెదేపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాలను వివరిస్తూ.. వైసీపీ పాలనలో ప్రజలు ఎలా విసుకుచెందారో వివరించారు. భారీ మెజారిటీ తో గెలిపించాలని స్థానిక ప్రజలను కోరారు.
కృష్ణా జిల్లా
విజయవాడ 35 డివిజన్లో ఎంపీ కేశినేని నాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాష్ట్రంలో రౌడీయిజం, గూండాలపాలన నడుస్తోందని ధ్వజమెత్తారు. నాయకులు పార్టీ అవసరాలకు పనిచేయాల్సిందే అని నాని స్పష్టం చేశారు. చిన్న చిన్న గొడవలు సర్ధుబాటు చేసుకొని పార్టీ గెలుపు కోసం ముందుకెళతామన్నారు. విజయవాడ నగర ఎన్నికలలో తెదేపా జెండా ఎగరవేయటమే తమ లక్ష్యమన్నారు.
ఇదీ చదవండి: 'వైకాపా పాలన ఉగ్రవాదానికి అద్దం పడుతోంది'