మాజీ మంత్రి, భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు మృతికి సంతాపంగా విజయవాడ పార్టీ కార్యాలయంలో సంతాప సభ ఏర్పాటు చేశారు. పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ దియోదర్ తదితరులు హాజరయ్యారు. కన్నా లక్ష్మీనారాయణ, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీమంత్రి సురేష్ ప్రభు, ఇతర నేతలు ఆన్లైన్ ద్వారా సంతాప సభలో పాల్గొన్నారు.
ముందుగా మాణిక్యాలరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్త నుంచి మంత్రి వరకు ఆయన ప్రస్థానాన్ని, ప్రజా సేవలో ఆయన చేసిన కృషిని వివరిస్తూ రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. మాణిక్యాలరావుది ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వమని నేతలు కొనియాడారు. మంత్రి పదవి కన్నా విలువలే ముఖ్యమని రాజీనామాకు సిద్ధపడ్డారని గుర్తు చేశారు. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి వరకూ పోరాడారన్నారు. భాజపా కార్యకర్త ఎలా ఉండాలో చెప్పేందుకు మాణిక్యాలరావు ఒక ఉదాహరణ అని నేతలు అన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి...