ఇవీ చదవండి..
జగన్‌కి ఒక్క అవకాశం ఇవ్వండి: మంచు మోహన్‌బాబు - ఎన్నికల ప్రచారం
చంద్రబాబుకి ఉదయం లేస్తే జగన్ ధ్యాసే అని సినీనటుడు మోహన్‌బాబు విమర్శించారు. కృష్ణా జిల్లా విజయవాడలో వైకాపా తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
మోహన్ బాబు
చంద్రబాబుకి ఉదయం లేస్తే జగన్ ధ్యాసే అని సినీనటుడు మోహన్‌బాబు విమర్శించారు. కృష్ణా జిల్లా విజయవాడలో వైకాపా తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ తనది కాదనీ... అందరి కష్టంతో ఎదిగిన పార్టీని లాక్కున్నారని ఆరోపించారు. తనపై ఉన్న కేసుల విచారణ ఎదుర్కోలేక స్టేలు తెచ్చుకున్నారని దుయ్యబట్టారు. వైఎస్ జగన్‌పై కేసులు పెట్టింది మీరు కాదా అని ప్రశ్నించారు. పోలవరం నిధులపై ఖర్చుల లెక్కలు ఏవని అన్నారు. ఓటుకు నోటు కేసులో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారని గుర్తుచేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ పథాకలు పేదలను ఆదుకున్నాయన్నారు. జగన్‌కి ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వైకాపా తరఫున రాష్ట్రమంతా ప్రచారం చేస్తానని స్పష్టంచేశారు.
ఇవీ చదవండి..
sample description