ETV Bharat / state

విజయవాడ శివారులో అందుబాటులోకి మత్స్యవిపణి - ఏపీ మత్స్యశాఖ వార్తలు

విజయవాడ శివారులో తొలిసారిగా మత్స్య విపణి కేంద్రం అందుబాటులోకి వచ్చింది. రాష్ట్ర మత్స్యశాఖ, మత్స్యకారుల సహకార సంఘ సమాఖ్యల ఆధ్వర్యంలో ఈ కేంద్రం నిర్వహిస్తున్నారు. సుమారు 7 లక్షల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో తొలిదశలో రోజుకు టన్ను చొప్పున చేపలు, రొయ్యలు, పీతలు వంటివి విక్రయించాలని నిర్ణయించారు.

model fish market
విజయవాడ శివారులో అందుబాటులోకి మత్స్యవిపణి
author img

By

Published : Jul 19, 2020, 9:17 PM IST

విజయవాడ శివారులో అందుబాటులోకి మత్స్యవిపణి

సముద్ర ఆహార ఉత్పతుల విక్రయాలకు మత్స్యశాఖ రిటైల్ దుకాణాలకు శ్రీకారం చుట్టింది. ఇదివరకు శాకాహారుల కోసం రైతు బజార్లు ఉన్నట్టుగానే... విజయవాడ శివారులోని గంగూరు వద్ద మత్స్యవిపణి కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా నిత్యం వివిధ రకాల చేపలు, పీతలు, రొయ్యలను విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు అందించడం ఈ విపణి ఉద్దేశం. రాష్ట్రంలోని ఆక్వా ఉత్పత్తుల్లో కనీసం 30 శాతం ఉత్పత్తులను స్థానికంగా రిటైల్ రంగం ద్వారా ప్రజలకు చేరువ చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. కరోనా వల్ల ఎగుమతులకు ఆటంకాలు ఎదురవుతుండటం వల్ల.... మత్స్య సంపదను మరింత లాభసాటిగా మార్చి... స్థానిక మార్కెట్లను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగానే ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే విజయవాడలో మరో రెండు రిటైల్‌ దుకాణాలను ఏర్పాటు చేయనున్నట్లు మత్స్య శాఖ అధికారి తెలిపారు.

పరిశుభ్రమైన వాతావరణంలో...

ఆదివారం వచ్చిందంటే చేపల అమ్మకాలు రోడ్ల పక్కన అపరిశుభ్ర వాతావరణంలో యథేచ్ఛగా జరుగుతుంటాయి. దానికి భిన్నంగా నాణ్యమైన చేపలు, రొయ్యలు, ఇతర సముద్ర ఆహార ఉత్పత్తులను సజీవంగా పరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ చేసి విక్రయించేలా ఈ విపణిని తీర్చిదిద్దడంతో వినియోగదారులు ముందుకొస్తున్నారు.

త్వరలో ఈ కేంద్రంలోనే చేపలు, రొయ్యల వంటకాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. హోం డెలీవరి ద్వారా ఇంటి వద్దకే సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. విజయవంతమైతే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ముఖ్య ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇవీ చూడండి- మన చదరంగం జగజ్జేత.. ఘనమైన ఈ చరిత్ర తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.