కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో సినీ ఫక్కీలో భద్రతా దళాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. హఠాత్తుగా అసాంఘిక శక్తులు విమానాన్ని హైజాక్ చేస్తే ఎలాంటి చర్యలు చేపట్టాలో అనే అంశంపై అధికారులు యాంటీ హైజాక్ ఆపరేషన్ను నిర్వహించారు. రాష్ట్ర హోంశాఖ ముఖ్యకార్యదర్శి కేఆర్ఎం కిషోర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అంతకుముందు పోలీసులు, భద్రతా దళాధికారులు, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ కలిసి సమావేశమయ్యారు.
ఇదీ చూడండి: 'మైలవరంలో ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ఫిట్ ఇండిమా 2కె రన్'