దళితలు అంతా ఒక్కటై వైకాపా ప్రభుత్వాన్ని దహనం చేసే రోజు దగ్గరలోనే ఉందని... ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు హెచ్చరించారు. ప్రశ్నించిన దళిత యువతి కుటుంబాన్ని సజీవ దహనం చేసే కుట్ర వైకాపా ప్రభుత్వం చేసిందని ఆయన ఆరోపించారు. కృష్ణా జిల్లాలో ప్రేమించి మోసం చేసిన సాయిరెడ్డిని న్యాయం చేయమని అడిగితే... దళిత యువతి ఇంటికి నిప్పంటించారని మండిపడ్డారు. జగన్, వైకాపా ప్రభుత్వ దళిత వ్యతిరేక చర్యలకు ఈ ఘటన పరాకాష్ట అంటూ ఓ వీడియోను పోస్ట్ చేశారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో కొత్తగా 9,999 కరోనా కేసులు, 77 మరణాలు