ETV Bharat / state

'రైతులకు ఆదాయవనరులు లేకుండా చేశారు'

author img

By

Published : Jan 23, 2020, 10:48 PM IST

భవిష్యత్తులో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ... ప్రభుత్వాలకు రైతులు భూమి ఇచ్చే పరిస్థితి లేకుండా వైకాపా చేస్తోందని... భాజపా ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు.

భాజపా శాసనమండలి సభ్యులు పీవీఎన్ మాధవ్
భాజపా శాసనమండలి సభ్యులు పీవీఎన్ మాధవ్
'రైతులకు ఆదాయవనరులు లేకుండా చేశారు'

భాజపా ఎమ్మెల్సీ మాధవ్​ను రాజధాని ప్రాంత రైతులు కలిశారు. రాజధానిని తరలించకుండా అసైన్డ్ చట్టాన్ని రద్దు చేసేలా ప్రభుత్వాన్ని కోరాలని వినతిపత్రం అందజేశారు. కొన్ని రోజులుగా అక్కడి పరిస్థితుల గురించి ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రైతులు రాజధాని కోసం భూములిచ్చారని కొనియాడారు. ఇప్పుడు వారికి ఆదాయవనరులు లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్​సైడర్ ట్రేడింగ్ జరిగితే కేసులు పెట్టాలి కానీ... ఇలా చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం తన ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి

'ఆ మంత్రులను సస్పెండ్ చేయాలి'

AP_VJA_37_23_FARMERS_MEET_BJP_MLC_AVB_3182358 REPORTER: MAHESH CAMERA: BHASKARRAO ( ) భవిష్యత్తులో రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ ప్రభుత్వాలకు రైతులు భూమి ఇచ్చే పరిస్థితి లేకుండా వైకాపా ప్రభుత్వం చేస్తోందని భారతీయ జనతా పార్టీ శాసనమండలి సభ్యులు పీవీఎన్ మాధవ్ అన్నారు. విజయవాడ నగర పార్టీ కార్యాలయంలో రాజధాని ప్రాంత రైతులు మాధవ్ ను కలిసి.....రాజధాని ఇక్కడే ఉంచడం సహా....అసైన్డ్ ల్యాండ్ చట్టాన్ని రద్దు చేసేలా ప్రభుత్వాన్ని కోరాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాజధానిలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను రైతులు మాధవ్ కు వివరించారు. తమ బతుకులు మారుతాయని....ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులు రాజధాని కోసం భూములు ఇచ్చారని....అన్ని పార్టీలు కలిసి నిర్ణయం తీసుకున్నాక ఇప్పుడు రాజధాని స్థాయి తగ్గించేలా వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందన్నారు. వ్యవస్థలను నిర్వీర్యం చేయడమే కాకుండా....ఆదాయ వనరులు లేకుండా చేసి....ప్రజలను పక్కదారి పట్టించడం కోసం వైకాపా నేతలు చూస్తున్నారని విమర్శించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగితే కేసులు పెట్టాలి కానీ....ఇలా చేయడం సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు..........స్పాట్, బైట్ బైట్......పీవీఎన్ మాధవ్, భాజపా ఎమ్మెల్సీ

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.