విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సింగ్‌నగర్ ప్రాంతానికి చెందిన ముస్లింలు ధర్నా చేశారు. శాసనమండలి ఛైర్మన్‌పై వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళన చేసినట్టు ముస్లింలు తెలిపారు. తమను కించపరుస్తూ... మాట్లాడటం సరికాదన్నారు. మండలి ఛైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తిపై అలాంటి వ్యాఖ్యలు చేయటం తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి