రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తరువాత ప్రతి ఏడాది ఉద్యోగాల ఖాళీలను జనవరిలో క్యాలండర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్సీ లక్ష్మణరావు గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చి రెండు జనవరులు ముగిశాయని ఎద్దేవా చేశారు. విజయవాడలో భారత ప్రజాతంత్ర ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది నవంబర్ 22న ఏపీపీఎస్సీ ఓపెన్ హౌస్ నిర్వహించి, 2020 జనవరి నుంచి వార్షిక క్యాలండర్ ప్రకటించి నోటిఫికేషన్లు విడుదల చేస్తామని చెప్పిన మాటలు చేతల రూపంలో ఆచరణలోకి రాలేదని మండి పడ్డారు. వార్షిక క్యాలెండర్ ను ప్రకటించి, ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని కోరారు.
ఇవీ చూడండి...