సొంత పార్టీ వారే అక్రమ మైనింగ్ కేసు వేసినందున అంబటి రాంబాబు తన శాసన సభ్యత్వం వదులుకోవాలని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు. తన నియోజకవర్గంలో జరిగిన అక్రమ మైనింగ్‌పై అంబటి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు.
ప్రభుత్వం ఎందుకు జరిమానా విధించలేదని న్యాయస్థానం ప్రశ్నించడం చూస్తే... అతను అక్రమ మైనింగ్కి పాల్పడ్డారని హైకోర్టు నిర్ధారణకు వచ్చినట్లు స్పష్టమవుతోందన్నారు. ఒక్క సారి ఎమ్మెల్యే అయ్యాక మళ్లీ ఎమ్మెల్యే కావడానికి అంబటి రాంబాబుకి 25 ఏళ్లు పట్టిందని ఎద్దేవా చేశారు. మూడు సార్లు ఓడి, రెండు సార్లు టిక్కెట్ దొరకని ఆయన.. తెదేపాని విమర్శించటం విడ్డూరంగా ఉందన్నారు.
ఇదీ చదవండి: