రాష్ట్రంలో సాగుతున్న ఆరాచక పాలన దేశ చరిత్రలో ఒక మాయని మచ్చలా మిగిలేలా ఉందని విశాఖపట్నం దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆరోపించారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర..హత్య కేసులో నిందితుడిగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆ క్రమంలో కొల్లు రవీంద్ర కుటుంబసభ్యులను వాసుపల్లి గణేష్ పరామర్శించారు. అక్రమంగా రవీంద్రను హత్యకేసులో ఇరికించారని.. త్వరలోనే ఆయన నిర్ధొషిగా బయటకు వస్తారని తెలిపారు. మత్స్యకారుల సంఘ ప్రతినిధిగా తాను కొల్లు రవీంద్ర కుటుంబానికి ధైర్యం చేప్పేందుకు వచ్చానని ఎమ్మెల్యే తెలిపారు. తెదేపాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్స్యకారుల సంఘాలన్నీ కొల్లుకు అండగా నిలుస్తాయని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'భారత ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేదు?'