కృష్ణా జిల్లా మైలవరం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో నిర్మించనున్న సమగ్ర వ్యవసాయ ప్రయోగశాలకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ భూమి పూజ చేశారు. రైతు అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెడుతున్న ఈ కార్యక్రమాలతో రానున్న రోజుల్లో అన్నదాతలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ పామర్తి శ్రీనివాసరావు, వ్యవసాయాధికారులు, వైకాపా నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి రాష్ట్ర అభివృద్ధికి సీఎం ఛాన్సే లేకుండా చేశారు : లోకేశ్