ETV Bharat / state

గన్నవరం తెదేపా కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరుల దాడి - MLA Vamshi

గన్నవరం తెదేపా కార్యాలయంపై  దాడి
గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి
author img

By

Published : Feb 20, 2023, 6:07 PM IST

Updated : Feb 21, 2023, 7:43 AM IST

17:54 February 20

కార్యాలయ ఆవరణలోని కారుకు నిప్పంటించిన వంశీ అనుచరులు

గన్నవరం తెదేపా కార్యాలయంపై ఎమ్మెల్యే వంశీ అనుచరుల దాడి

Tension at Gannavaram: గన్నవరంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ, వైఎస్సార్సీపీ నాయకుల మధ్య మాటల మంటలు భగ్గుమన్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే వంశీ విమర్శించడంపై ఆ పార్టీ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు ఎమ్మెల్యే వంశీపై విమర్శలు గుప్పించగా.. తమ నాయకుడినే విమర్శిస్తారా.. అంటూ వంశీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నాకు ఫోన్‌ చేసి బూతులు మాట్లాడారు. ఎమ్మెల్యే అనుచరులమంటూ బెదిరింపులకు దిగారు. ఉదయం నుంచి పలు నంబర్లతో చిన్నాకు బెదిరింపు ఫోన్లు చేశారు. ఇదిలా ఉండగా, సాయంత్రం గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డారు. కార్యాలయంలోని సామగ్రిని ధ్వంసం చేయడంతో పాటు పలు వాహనాలను ధ్వంసం చేశారు. ఆవరణలోని ఓ కారుకు నిప్పంటించారు. క్షణాల్లో మంటలు చెలరేగి అందరూ చూస్తుండగానే కారు కాలి బూడిదైపోయింది. పోలీసులు వారిని ఏ మాత్రం నియంత్రించకుండా ప్రేక్షకపాత్ర వహించడం గమనార్హం. తీవ్రంగా ఖండించిన టీడీపీ నాయకులు.. పార్టీ కార్యాలయంపై దాడి నేపథ్యంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఆగడాలను టీడీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. వల్లభనేని వంశీ నెత్తిన రూపాయి పెడితే.. పావలాకి అమ్ముడుపోలేని దద్దమ్మ అని టీడీపీ సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. సైకో సీఎం అండతో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఆకురౌడీలు చెలరేగిపోతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జగన్ రౌడీ పాలనకు పరాకాష్ట అని మండిపడ్డారు.

ప్రతి చర్య తప్పదు.. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి దుర్మార్గమని ఆ పార్టీ సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర మండిపడ్డారు. తల్లి పాలు తాగి రొమ్మును గుద్దినట్లు.. వంశీ వ్యవహారం ఉందని, చంద్రబాబు బిక్షతో గెలిచి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జగన్ రెడ్డి రాక్షస పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నించిన వారికి కత్తులతో సమాధానం చెప్పడం జగన్ రెడ్డి ఆటవిక పాలనకు నిదర్శనమని దుయ్యబట్టారు. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వంశీ... వెన్ను విరవడం తథ్యమని హెచ్చరించారు. గూండాలు, రౌడీలు పేట్రేగిపోవడానికి జగన్ రెడ్డే కారణమని విమర్శించారు. నెత్తిన రూపాయి పెడితే.. పావలాకి అమ్ముడుపోలేని దద్దమ్మ వల్లభనేని వంశీ అని వ్యాఖ్యానించారు. పులివెందుల ఫ్యాక్షన్ రాజకీయాన్ని జగన్ రెడ్డి రాష్ట్రమంతా విస్తరిస్తున్నారని మండిపడ్డారు. దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయంపై దాడి చేయడం గర్హణీయమని ఆక్షేపించారు. జగన్ రెడ్డి ప్రతి చర్యకూ త్వరలోనే ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ అరాచక పాలన, అకృత్యాలకు ప్రజలు చరమగీతం పాడబోతున్నారన్నారు. ఈ రోజు దాడి చేసిన ప్రతి ఒక్కరినీ గుర్తుపెట్టుకుని అంతకంతా చెల్లిస్తామని హెచ్చరించారు.

వంశీ తల పొగరు అణచివేస్తాం... సైకో సీఎం అండతో రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ఆకురౌడీలు చెలరేగిపోతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జగన్ రౌడీ పాలనకు పరాకాష్ట అని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ రౌడీ మూకలు.. పట్టపగలే కార్యాలయంలోకి చొరబడి కర్రలు, రాళ్లతో దాడి చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గన్నవరంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరాచకం అంతకంతకూ పెరుగుతోందని విచారం వ్యక్తం చేశారు. ఈ దాడికి సూత్రధారి వంశీనే అని.., అతడి కనుసన్నల్లోనే దాడి జరిగిందని ఆరోపించారు. వంశీ ఒక్క ఏడాది ఓపిక పడితే ఆయన.. తల పొగరు అణిచివేస్తామని హెచ్చరించారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారిని, చేయించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు.

మరోసారి ఉద్రిక్తత: గన్నవరంలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. బీసీ నేత దొంతు చిన్న కారును వైసీపీ కార్యకర్తలు తగలబెట్టారు. పోలీసుల తీరుకు నిరసనగా తెదేపా శ్రేణులు మరోసారి రోడ్డుపై ఆందోళనకు దిగారు.

సీఎం, డీజీపీదే బాధ్యత: తన భర్త కొమ్మారెడ్డి పట్టాభి పోలీసుల అదుపులోనే ఉన్నారని ఆయన భార్య చందన ఆరోపించారు. మీడియాతో మాట్లాడిన ఆమె.. దాడి విషయం తెలిసి పట్టాభి.. గన్నవరం కార్యాలయానికి వెళ్లారని తెలిపారు. నా భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆమె అన్నారు. నా భర్తను ఎక్కడకు తీసుకెళ్లారో తెలియదని.. ఆయనకు ఏం జరిగినా సీఎం, డీజీపీదే బాధ్యత అని స్పష్టం చేశారు.

అరెస్ట్​ దారుణం: మరోవైపు పట్టాభి అరెస్టును వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు ఖండించారు. బాధితులనే అరెస్టు చేయడం దారుణమని అన్నారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని రఘురామ కృష్ణరాజు డిమాండ్​ చేశారు.

ఇవీ చదవండి :

Last Updated : Feb 21, 2023, 7:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.