కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందవద్దని, తగు జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు సూచించారు. స్థానిక పంచాయతీ పరిధిలోని తొమ్మిదో వార్డులో కరోనా పాజిటివ్ వచ్చి మరణించిన మృతుడి కుటుంబసభ్యులను దూరంగా ఉండి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరామర్శించారు.
ఈ సమయంలో ప్రజలు భౌతికదూరం పాటిస్తూ, మాస్కులు ధరించటం, శానిటేషన్ చేసుకోవటం చాలా ముఖ్యమని వివరించారు. అనంతరం స్థానిక కోర్టు సెంటర్ నుంచి ఈస్ట్ కోస్ట్ వరకు చేపట్టిన సోడియం హైపోక్లోరైడ్ ద్రావణ పిచికారీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఇదీ చూడండి