కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని మెువ్వ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రారంభించారు. పంట ఇంకా కోతకు రాకముందే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం... రైతులపై ముఖ్యమంత్రికున్న అంకిత భావం తెలియజేస్తుందని ఆయన అన్నారు.
ప్రతి గ్రామంలో రైతులు.. రైతు భరోసా కేంద్రంలో పంట నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. గత సంవత్సరం యంత్రాలతో కోసిన ధాన్యం తేమ శాతం ఎక్కువగా ఉండి రైతులు ఇబ్బంది పడ్డారని.. అలా జరగకుండా ఈ సారి అధికారుల దృష్టికి తీసుకెళ్లి ధాన్యం కొనుగోలు చేస్తామని తెలియజేశారు.
ఇదీ చదవండి: