కృష్ణా జిల్లాలోని నందిగామ మార్కెట్ యార్డులో సుబాబుల్ రైతుల సమస్యలపై ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు సమావేశాన్ని నిర్వహించారు. పేపర్ కర్మాగారాలు కలపను కొనుగోలు చేయడం లేదని.. దీనిపై ప్రభుత్వం ఏరకంగానూ చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోయారు. టన్ను రూ.4,200 కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. జాఫర్ కర్మాగారాలు దారిలోకి రావాలంటే రైతులంతా సంఘటితంగా ఉద్యమించాలని ఎమ్మెల్యే జగన్మోహన్ రావు కోరారు. దీనిలో భాగంగా కొన్నాళ్లపాటు రైతులంతా కర్మాగారాలకు కలపను విక్రయించకుండా ఉంటే ... అప్పుడు కర్మాగారాలు దారిలోకి వస్తాయని తెలిపారు.
ప్రభుత్వం సుబాబుల్ రైతులకు న్యాయం చేసేందుకు కసరత్తు చేస్తోందని ఎమ్మెల్యే అన్నారు. కర్మాగారాలు మొత్తం.. ప్రభుత్వం ద్వారానే రైతుల నుంచి కలపను కొనుగోలు చేసేలా ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఈ విషయంపై తుది నిర్ణయం రావాల్సి ఉందన్నారు. మార్కెట్ యార్డ్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు, నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గల రైతులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: